Header Banner

నైరుతి పవనాలు రికార్డు బ్రేక్‌.. 2009 తర్వాత ఇదే తొలిసారి! వాతావరణ శాఖ బిగ్ అప్డేట్..!

  Sun May 11, 2025 11:36        Others

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు.. అదే సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సారి వర్షాకాలం ముందే రానున్నట్లు వెల్లడించింది. మే 27వ తేదీన నైరుతీ రుతు ప‌వ‌నాలు కేర‌ళ‌ను తాక‌నున్న‌ట్లు పేర్కొంది. ఇక రానున్న రెండు రోజుల్లో ఏపీలో అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ జారీ అయింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. మరో మూడు రోజుల్లో అండ మాన్ ను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 27న కేరళను తాకనున్నట్లు వెల్ల డించారు. అంచ‌నా వేసిన‌ట్లు ముందుగానే రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను చేరితే, అప్పుడు 2009 త‌ర్వాత తొలిసారి వ‌ర్షాకాలం ముందుగా వ‌స్తున్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది.

2009 సంవ‌త్స‌ రంలో మే 23వ తేదీన నైరుతీ కేర‌ళ‌ను తాకిన‌ట్లు ఐఎండీ డేటా చబుతోంది. సాధార‌ణంగా జూన్ ఒక‌టో తేదీ వ‌ర‌కు కేర‌ళ‌లోకి నైరుతీ రుతుప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయి. ఈ రుతుప‌వ‌నాల వ‌ల్లే దేశంలో వ‌ర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆ త‌ర్వాత జూలై 8వ తేదీలోగా దేశ‌వ్యాప్తంగా ఆ రుతుప‌వ‌నాలు విస్త‌రిస్తాయి. ఇక సెప్టెంబ‌ర్ 17వ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగ‌మ‌నం అవుతాయి. అక్టోబ‌ర్ 15వ తేదీలోగా పూర్తి ఆ రుతుప‌వ‌నాలు వెళ్లిపోతాయి. 2025 వ‌ర్షాకాలంలో.. సాధార‌ణం క‌న్నా అధికంగానే వ‌ర్షం కురు స్తుంద‌ని ఏప్రిల్‌లో ఐఎండీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఎల్ నినో ప‌రిస్థితులు ఉండ‌బోవ‌ని ఐఎండీ పేర్కొన్న‌ది. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఈసారి నాలుగు నెలల్లో వ‌ర్షపాతం నార్మ‌ల్ స్థాయి క‌న్నా ఎక్కువే ఉంటుంద‌ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Monsoon2025 #IMDAlert #WeatherUpdate #EarlyMonsoon #RainySeason #KeralaMonsoon #RecordBreak